స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 774 లో.. రిషి వెళ్ళిపోతుంటే వసుధార, జగతి ఇద్దరు వెళ్ళొద్దని బ్రతిమిలాడుతూ తన వెనకాలే వెళ్తారు. తన ఏడుస్తూ కొడుకుని కాపాడుకోవాలనే ఇలా చేశానని జగతి అంటుంది. కొడుకును కాపాడుకోవడానికి మోసగాడు అని ముద్ర వెయ్యాలా అని రిషి ఆవేశంగా మాట్లాడుతాడు. చిన్నప్పుడు నువ్వు నన్ను వదిలివెళ్తుంటే ఆ బాధ నాకు తెలియలేదు.. మళ్ళీ నా జీవితంలోకి వచ్చారని రిషి అంటాడు. వసుధారని ప్రేమిస్తున్నట్లు మీరే చెప్పారు.. ఆ తర్వాత ఇలా మోసగాడిని చేశారు. ఇది నయవంచనే కదా. ఇంత బాధని నేను మోయలేకపోతున్నానని రిషి అంటాడు.
రిషి నిన్ను కాపాడుకోవడానికి ఇలా చేశాను.. వసుధార తప్పేం లేదని జగతి అంటుంది. మీ తప్పేం లేదు, తప్పంత నాదే, మనసంటూ ఒకటి ఉంటుందని నమ్మాను.. ఏం పాపం చేశాను.. మీ కడుపున పుట్టడమే నేను చేసిన నేరమా.. అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు ఉంటాయి.. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి. కొడుకుకి ఏ తల్లి ద్రోహం చెయ్యాలనుకుంటుంది.. బాగా నమ్మినవారు మోసం ఎలా చేస్తారో చూపెట్టారు.. నన్ను బతికి ఉండగానే చంపేశారు.. నేను మోసగాడని అందరికి తెలిసేలా చేశారని రిషి అంటాడు. నిన్ను మోసం చెయ్యలేదు.. నన్ను నమ్ము అని జగతి ఏడుస్తుంది. మీరు చేసింది న్యాయమే.. ఇప్పుడు సాయం చెయ్యండి. నన్ను కలవకండి.. నాతో మాట్లాడకండని రిషి అంటాడు. నా కొడుకు ఎటు వెళ్ళాడని మీ డాడ్ అడిగితే నేనేం చెప్పాలని జగతి అంటుంది. మోసం చేసి పారిపోయాడని చెప్పి నమ్మించండని రిషి అంటాడు. మీరు నన్ను వదిలి వెళ్ళిపోయాక.. నాకు చాలా బాధగా ఉండేది. మీరు వచ్చాక మిమ్మల్ని చాలా సార్లు అమ్మ అని పిలువాలని అనుకున్నాను కానీ ఇలాంటి ఒక రోజు వస్తుంది అనుకోలేదు. తల్లిని క్షేమించే కొడుకు ఇంకా పుట్టలేదు అనుకుంటా కానీ కొడుకుగా కాపాడుకుంటున్నాను.. నన్ను చంపేశావ్ కదా అమ్మా అని రిషి అనగానే.. తను అలా అమ్మా అని పిలిచేసరికి జగతి ఎమోషనల్ అవుతుంది. రిషి నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా అని జగతి అంటుంది. జీవితంలో ఈ పిలుపు వినలేదనే దిగులు మీకు ఉండొద్దు.. మీకు ఇక కన్పించనని చెప్పి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
రిషి వెళ్తుంటే వసుధార వెనకాల నుండి వెళ్ళి హాగ్ చేసుకొని రిషిని వెళ్లకుండా ఆపుతుంది. కానీ రిషి వసుధారని గట్టిగ వెనక్కి నెట్టేస్తాడు. కారణం తనని వసుధార మోసం చెయ్యడం రిషి భరించలేకపోతాడు. ఇకనుండి రిషిధార కాదు వసుధార అని వేలుకి ఉన్న VR రింగ్ ని తీసి వసుధార చేతిలో పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.